నంద్యాల అర్బన్: నంద్యాలలో బంగారం వెండి వ్యాపారస్తులకు కీలక సూచనలు చేసిన ఏఎస్పీ జావలి
Nandyal Urban, Nandyal | May 24, 2026
నంద్యాల పట్టణంలో బంగారం, వెండి వ్యాపారుల భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో ఏఎస్పీ ఎం.జావళి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. దుకాణాల్లో నాణ్యమైన సీసీటీవీలు, బర్గర్ అలారాలు, డిజిటల్ లాక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, వెంటనే 112 లేదా 100 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.