బనగానపల్లె: బనగానపల్లెలో ఓ మోస్తారు వర్షం
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం 6:30 గంటల నుంచే ఆకాశం కారుమబ్బులతో కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. చిరుజల్లులు, చల్లని గాలులతో ప్రజలకు ఎండ వేడిమి నుండి ఉపశమనం లభించింది. వర్షం కారణంగా రహదారులు తడిసిపోవడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించారు. ఈ వర్షం తమ పంటలకు ఎంతో మేలు చేస్తుందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.