భార్యతో ఘర్షణ పడి మనస్థాపంతో పురుగుల మందు తాగిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల నాగేంద్ర అనే వ్యక్తి తన భార్యతో ఘర్షణ పడి తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతను నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మాత్రం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.