గుంతకల్లు: గుత్తి జట్కా స్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి, విచారణ చేపట్టిన పోలీసులు
గుత్తిలోని గాంధీ సర్కిల్ సమీపంలో ఉన్న జట్కా స్టాండ్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ హనుమంతు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఎండ తీవ్రతకు మృతి చెందాడా? లేక అనారోగ్య కారణాలవల్ల మృతి చెందాడో తెలియడం లేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.