కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల కొరత తీర్చాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్య శాల పరిస్థితిపై కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అసెంబ్లీలో మంగళవారం మాట్లాడారు. దాతల సహకారంతో వైద్య శాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి అధ్వానంగా ఉండేదన్నారు. రెగ్యులర్ వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.