ఆళ్లగడ్డ: పడకండ్లలో అధికారుల నిర్లక్ష్యం లో తృటిలో తప్పిన ప్రమాదం
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల ఎస్సీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభం ఇంటి పై కప్పు పై పడడంతో తృటిలో ప్రమాదం తప్పింది, స్థానికులు తెలిపిన వివరాల మేరకు నీటి కుళాయి కోసం తవ్విన గుంతను పూడ్చక పోవడం వల్ల విద్యుత్ స్తంభం ఒరిగి తీగలు ఇంటి రేకులపై పడ్డాయి, నిప్పురవ్వలు పడడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు భయాందోళనకు గురయ్యారు