బనగానపల్లె: ఎనకండ్లలో మూడేళ్లుగా శుభ్రం చేయని త్రాగునీటి ట్యాంక్
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ఎనకండ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఓవర్ హెడ్ ట్యాంక్ను గత మూడేళ్లుగా శుభ్రం చేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్కు వెళ్లే మెట్లు విరిగిపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది ట్యాంక్పైకి ఎక్కలేకపోతున్నారని వారు తెలిపారు.ట్యాంక్ను శుభ్రంచేయకపోవడం వల్ల కలుషిత నీరు సరఫరా అవుతోందని, దీంతో చర్మవ్యాధులతోపాటు ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు