సత్య సాయి జిల్లా రామగిరి మండలం శేశం పల్లి గ్రామంలో బుధవారం నాలుగు గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉప్పర సంజీవ్ మృతి దేహానికి రాప్తాడు నియోజకవర్గం సీనియర్ వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శేశం పల్లి గ్రామానికి చెందిన ఉప్పర సంజీవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాల వైఎస్ఆర్ పార్టీ తాము అండగా ఉంటామని రాప్తాడు నియోజకవర్గం సీనియర్ వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.