ఇబ్రహీంపట్నం: బీసీ డిక్లరేషన్ చేయాలని హస్తినాపురంలో బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
రంగారెడ్డి జిల్లా హస్తినాపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, బీసీ కులాల సమన్వయ వేదిక నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు.. ఈ సందర్భంగా బీసీ సమగ్ర కుల గణన చేపట్టాలని 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వారు కోరారు.