రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 25 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్య తనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.