ఆత్మకూరు: తుఫాన్ ప్రభావంతో జాతీయ రహదారిపై నేలమట్టమైన చెట్టు, వెంటనే చెట్టును తొలగించిన పోలీసులు
తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన ఈదురు గాలులకు మంగళవారం రాత్రి సంగం - కొరిమెర్ల రహదారి మధ్యలో పెద్ద చెట్టు నేలమట్టమైంది. రహదారి మొత్తం చెట్టుతో నిండిపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో కలిసి చెట్టును తొలగించారు. రహదారి క్లియర్ చేయడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.