సంగారెడ్డి: పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బుచ్చంద్ర మాదిగ మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ను రూ.6 వేలకు, వృద్ధులు వితంతువులకు 4 వేలకు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి పెన్షన్లను పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులు వృద్ధులు వితంతువులు పాల్గొన్నారు.