ఉరవకొండ: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ( APSPEJAC) ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం శంఖారావం కార్యక్రమంతో దశల వారి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు మల్లెల శ్రీనివాస్, జితేంద్ర గురుమూర్తి, లైన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, నబీ రసూల్ తదితరులు నిరసన ధర్నాలో పాల్గొన్నారు.