వాహనదారులకు మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్న వారికీ రవాణా శాఖ పలు సూచనలు చేసిన రవాణ శాఖ అధికారులు
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్న వారికీ రవాణా శాఖ అధికారులు కీలక సూచనలు ఇచ్చారు.ఆత్మకూరు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతు,ఇప్పటి నుంచి LLR పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ మినహా మిగిలిన అన్ని రవాణా సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయని తెలిపారు.డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే,ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చన్నారు.LLR పొందాలంటే… గేర్ లేని వాహనాలకు కనీస వయస్సు 16 సంవత్సరాలు. గేర్ ఉన్న వాహనాలకు 18 సంవత్సరాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.