ఖైరతాబాద్: మాదన్నపేటలో ఏడేళ్ల బాలిక హత్య
మాదన్నపేటలో ఏడేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో అల్లరి చేస్తుందనే కోపంతో మేనమామ, అత్త కలిసి బాలికను కిరాతకంగా చంపినట్లు తేలింది. చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి వాటర్ ట్యాంకులో పడేశారని పోలీసులు తెలిపారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు