ఒంగోలు అర్బన్: ఒంగోలు ధారావారి తోటలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | Jul 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ధారావారి తోటలో బుధవారం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే కల్పనా కుమారి పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రతినెల 1వ తేదీ ఇంటి వద్దకే సిబ్బంది పెన్షన్లు తెచ్చి ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నూతన పెన్షన్లు కూడా అందించేందుకు యోచేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.