అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను మంగళవారం సాయంత్రం ఎలక్ట్రికల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉమాపతి తనిఖీ చేశారు. సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా సంబంధించిన టైమింగ్లు వ్యవసాయ మోటార్లకు సంబంధించిన టైమింగ్ ఎల్సీలు, ట్రిప్పింగ్ సమయాలపై ఆరా తీశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యుత్ శాఖ ఏఈ గంగాధర్, ఆపరేటర్ రుద్రమణి, ఎల్ఐ రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.