నంద్యాల అర్బన్: రైతుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం: నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా
Nandyal Urban, Nandyal | May 7, 2026
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలికొదిలేసిందని విమర్శిస్తూ నంద్యాల జిల్లాలో వైసీపీ శ్రేణులు గళమెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ.. నేడు నంద్యాల టేక్కే మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ నిరసనలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష, రాష్ట్ర CEC మెంబర్ పీ.పీ. నాగిరెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.