అనంతగిరి మండలంలోని సొలుబొంగు, కొత్తబూరుగ గ్రామాలకు రహదారి సౌకర్యం
ఏర్పాటుచేయాలని జలదీక్ష
అనంతగిరిలోని సొలుబొంగు, కొత్తబూరుగ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రైవాడ డ్యామ్ లో జలదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. రూ.3. 60 కోట్ల నిధులతో రోడ్డు మంజూరు చేసి, పనులు ప్రారంభించారని, అయితే ఫారెస్టు అనుమతులు లేక రోడ్డు పనులు నిలిపివేశారన్నారు. డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ స్పందించి ఫారెస్టు అనుమతులు ఇప్పించి, నిర్మాణం పూర్తి చేయాలన్నారు