పలమనేరు: బైరెడ్డిపల్లి: TDPనేతలు వేధిస్తున్నారని పిడుదులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో #viral
బైరెడ్డిపల్లి: మండలం పాతూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పశువులకు కొట్టే పిడుదుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గత కొన్ని రోజుల ముందు వైసీపీ నాయకుడు పుట్టినరోజులకు హాజరైనానని తెలుగుదేశం పార్టీ నాయకులు నాపై కక్ష కట్టారు, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశాడు విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు, పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సిఉంది.