జహీరాబాద్: ఉగ్గేల్లీలో నీటి కుంటలో గల్లంతైన బాలుడు మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి శివారులో నీటి కుంటలో గల్లంతైన బాలుడు మృతి చెందాడు. కోహిర్ మండలంలోని పీచే రేగడి గ్రామానికి చెందిన రిజ్వాన్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సోమవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు వెళ్లి నీటి కుంటలో గల్లంతు అయ్యాడు. పోలీసులు , ఫైర్ సిబ్బంది నీటి కుంటలో గాలింపు చేపట్టగా మంగళవారం ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైనది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.