డోన్: బేతంచర్ల లో జన గణన పై శిక్షణ కార్యక్రమం
Dhone, Nandyal | Apr 25, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహించే జనగణనపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శనివారం శిక్షణ ఏర్పాటు చేశారు.మే ఒకటి నుంచి నిర్వహించబోయే ఇళ్ల గణనపై 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నట్లు ట్రైనర్లు జనార్దన్, మహేశ్ తెలిపారు. ఇళ్లు, జనాభా దశల వారీగా గణన జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ICDS సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.