ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకం గా కోటి సంతకాల సేకరణ.
వైయస్సార్ పార్టీ ఇన్చార్జి. నీసార్ అహ్మద్.
అన్నమయ్య జిల్లా. మదనపల్లె మండలంలోని బొమ్మనుచెరువు ,మాలేపాడు తదితర గ్రామాలలో బుధవారం వైయస్సార్సీపి నియోజకవర్గ ఇన్చార్జ్ నీసార్ అహ్మద్. వైసీపీ నాయకులతో కలిసి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలకు వైద్యం దూరమవుతుందన్నారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.