రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని నరసరావుపేటలో యూటీఎఫ్ బైక్ ర్యాలీ
నరసరావుపేటలో గురువారం యూటీఎఫ్ సభ్యులు, ఉపాధ్యాయులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యా యులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర విద్యా రంగా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రణభేరి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.