ఉరవకొండ: అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి వాహన మిత్ర పథకం అమలు : బెలుగుప్ప ఎంపీడీవో లక్ష్మీనారాయణ
అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాహన మిత్ర పథకం ద్వారా రూ. 15000 రూపాయల లబ్ధిని అందించడం జరుగుతుందని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల ఎంపీడీవో లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం పేర్కొన్నారు. బెలుగుప్ప మండల వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లో అర్హతలు ఉన్న లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బెలుగుప్ప మండల కేంద్రంలోని సచివాలయంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారిని భార్గవికి గ్రామంలోని కొందరు ఆటో డ్రైవర్లు తమ దరఖాస్తులను అందించారు. ఈనెల 19 లోగా అర్హతలున్న ప్రతి ఒక్కరూ వాహన మిత్రకు దరఖాస్తు చేసుకోవాలని వెల్ఫేర్ అధికారిని పేర్కొన్నారు.