పలమనేరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా కనకదాస్ జయంతి, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్
పలమనేరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ దాస శ్రేష్ట కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలమనేరు కురబ సంఘ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకదాస చిత్రపటానికి పూజలు చేసి పుష్పాంజలి ఘటించారు. కనకదాసు చూపించిన మంచి మార్గంలో అందరూ నడిచి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వం సైతం కనకదాసు జయంతిని అధికారికంగా ప్రకటించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడు, కురబ సంఘ నాయకులు పాల్గొన్నారు.