విశాఖపట్నం: విశాఖ : లండన్ వేదికగా లోకేష్ రాజేసిన ఉక్కు జ్వాల : కొత్త స్టీల్ ప్లాంట్‌పై వివాదంపై భగ్గుమన్న కార్మిక నేతలు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లండన్‌లో బుధవారం చేసిన ప్రకటన విశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. దక్షిణ విశాఖలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఒక భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించబోతుందని, నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌కు భూమి పూజ జరగనుందని ఆయన ప్రకటించారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాలలో ఒకటిగా మారనుంది.అయితే, ఈ ప్రకటనపై ఉక్కు కర్మాగారం కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రైవేట్ కంపెనీకి మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.