ఒంగోలు అర్బన్: మాజీ మంత్రి బాలినేని పై తీవ్ర విమర్శలు, పదవులు అమ్ముకుంటున్నాడంటూ నాగేంద్రం అనే వ్యక్తి తీవ్ర ఆరోపణ
Ongole Urban, Prakasam | May 19, 2026
మాజీ మంత్రి ప్రస్తుత ప్రకాశం జిల్లా జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంగళవారం ఒంగోలుకు చెందిన నాగేంద్రం అనే వ్యక్తి బాలినేని పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ పదవులను బాలినేని అమ్ముకుంటున్నారని గతంలో కూడా ఇదేవిధంగా పదవులను ఉద్యోగాలను అమ్ముకున్నట్లు ఆరోపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.