ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో పోలీసుల తనిఖీలు : 18 బైకులు, నాలుగు ఆటోలు సీజ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా రామలక్ష్మమ్మ కొట్టాల ప్రాంతంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు, ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు, అనుమానితులు,పాత నేరస్తులు, రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు, అనంతరం ప్రజలకు శాంతి భద్రతలు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో సిఐ ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.