ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు, మంత్రి రవికుమార్
Ongole Urban, Prakasam | May 15, 2026
ప్రకాశం జిల్లాలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు శాలువా కప్పి సన్మానించారు. వీరికి ప్రోత్సాహకంగా రూ.10వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రేణుక, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.