కావలి: మత్స్యకారుల సమస్యలపై ఆరా తీసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు...
ఏపీలో తీరప్రాంతం ఎక్కువగా ఉందని, అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు.ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు.మత్స్యకారుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలో ఎక్కడలేని విధంగా జువ్వలదిన్నీ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అనుగుణంగా ఉందని అన్నారు.త్వరలో ఫిషింగ్ హార్బర్ నుంచి ఎగుమతులు దిగుమతులు జరిగేలా చూస్తున్నాం అని,తీరప్రాంతంలో బోట్లు, హర్బర్లు, ఎయిర్ పోర్టులు పై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.