గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లి గ్రామం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యాదినోత్సవం
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని బేతాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాఠశాలలో హెచ్ఎం రంగనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రంగనాథ్, ఉపాధ్యాయుడు రామకృష్ణయ్య మాట్లాడుతూ భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపు కుంటారన్నారు. ఆయన భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలు విద్యాశాఖా మంత్రిగా పనిచేసి విద్యారంగంలో విద్యాభివృద్దికి కృషి చేశారన్నారు.