సున్నిపెంట ఐటీడీఏ కార్యాలయంలో ఒకేసారి రెండు పాములు ప్రత్యక్షం,భయాందోళన చెందిన ఉద్యోగులు
శ్రీశైలం మండలం సున్నిపెంట శ్రీశైలం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐ.టీ.డీ.ఏ) కార్యాలయంలో గిరిజనులు, అధికారులు,నిత్యం తిరిగే కార్యాలయంలో నాగు పాము,మరొక పాము ప్రత్యక్షమయ్యాయి,పాములను చూసిన అధికారులు,గిరిజనులు భయాందోళనకు గురయ్యారు, గురువారం నాగుపాముతో పాటు మరొక పామును పట్టుకున్నారు,ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో రెండు పాములు గుర్తించిన సిబ్బంది స్నేక్ క్యాచర్ ముస్తక్ సమాచారం ఇచ్చారు స్నేక్ క్యాచర్ ముస్తాక్ ఎంతో చాకచక్యంగా రెండు పాములను పట్టుకొని,వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు, కార్యాలయంలో అందరూ ఉండగానే నాగుపాము సంచరించటంతో సిబ్బంది ఒక్కసారిగా భయాందోళన చెందారు,