ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ సిఐ నాగరాజరావు ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం పట్టణ సీఐ నాగరాజారావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు, రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకొని చట్టబద్ధంగా జీవనం సాగించాలని సీఐ నాగరాజరావు సూచించారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్ హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు