ఒంగోలు అర్బన్: పారిశుద్ధ్యము, ముఖ్యంగా డ్రైనేజీలలో పూడికతీతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుత
Ongole Urban, Prakasam | May 29, 2026
పారిశుద్ధ్యము, ముఖ్యంగా డ్రైనేజీలలో పూడికతీతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ' ఆపరేషన్ క్లీన్ స్వీప్ ' కార్యక్రమ నిర్వహణ తీరుపై పురపాలక శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ సురేష్ కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తో పాటు ఒంగోలు మున్సిపల్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ' ఆపరేషన్ క్లీన్ స్వీప్ ' కార్యక్రమంలో విజయవంతం చేయాలన్నారు