డోన్: డోన్ సమీపంలోని ఓ డాబా వద్ద ఆగి ఉన్న బస్సులో 2.750 కేజీల బంగారు చోరి
Dhone, Nandyal | Jun 21, 2026 నంద్యాల జిల్లా డోన్ సమీపంలో భారత్ డాబా వద్ద భారీ చోరీ జరిగింది. ATP నుంచి HYD వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో వ్యాపారి వద్ద ఉన్న 2.750 KGల బంగారాన్ని అపహరించారు.శుక్రవారం అర్ధరాత్రి తర్వాత డాబా వద్ద బస్సు ఆపగా బంగారం పోయినట్లు జడ్చర్ల వద్ద వ్యాపారి గుర్తించాడు. శనివారం డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. CC కెమెరాలు పరిశీలించగా బస్సును ఫాలో చేసిన స్కార్పియోలోని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు