ఒంగోలు అర్బన్: మూడేళ్లుగా కనిపించని తమిళనాడు వాసుల వివరాలు తెలిస్తే చెప్పాలని కోరిన తమిళనాడు సిఐడి అధికారులు
Ongole Urban, Prakasam | Jun 2, 2026
తమిళనాడు రాష్ట్రానికి చెందిన తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ గత మూడున్నర సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఘటనలో ప్రజల సహకారం కావాలని తమిళనాడు వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా అరక్కోణం రోడ్డు పరిధిలోని సోలింఘర్ గ్రామానికి చెందిన డి. రాజేష్ కుమార్ (39), ఆయన కుమారుడు ఆర్. సశ్వంత్ రాజేష్ (7), తల్లి డి. లలిత (65)లు 2022 నవంబర్ 13 నుంచి కనిపించకుండా పోయినట్లు వెల్లూరు సీబీసీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తమిళనాడు వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ డీఎస్పీ బి. సురేష్ పాండ్యన్ కోరారు