ఒంగోలు: సోమవారం మీకోసం కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు.ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ పర్యటన జిల్లాలో ఉన్నందున, సోమవారం పీజిఆర్ఎప్ హాలులో దళితుల నుంచి అర్జీలు సేకరించే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపారు. దూరప్రాంతాల ప్రజలు ఎవరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు...