కడప: ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
Kadapa, YSR | Sep 24, 2025 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను.. సమర్థవంతంగా అమలు చేసి.. ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఆకాంక్ష జిల్లా, బ్లాకుల లక్ష్య సాధనలో భాగంగా.. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులతో సమీక్షించారు