బనగానపల్లె: అవుకు రిజర్వాయర్ లో రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం, ఆందోళనలో రైతులు
నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్లో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతుండటంతో వేలాది ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4 TMCలు కాగా, ప్రస్తుతం కేవలం 1.20 TMCలే మిగిలి ఉన్నాయి.ఇటీవల అంతర్భాగమైన తిమ్మరాజు చెరువు రివెట్మెంట్ కూలడంతో నీటిని కాలువల ద్వారా కడప జిల్లాకు మళ్లించారు. దీంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.