అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం,NSS ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ భరత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ ఓజోన్ పొర అంటే ఏమిటి? అది విధంగా క్షీణిస్తుంది దానిని ఏ విధంగా పరిరక్షించుకోవాలో వివరించారు.