నంద్యాల అర్బన్: బొల్లవరంలో కొండచిలువ హల్చల్
Nandyal Urban, Nandyal | Jul 7, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరంలోని కోళ్ల ఫారం ప్రాంతంలో ఉన్న కొండలు ఇంటి సమీపంలో కొండచిలువ కనిపించడంతో సమీప కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన యువకులు వెంటనే అయ్యన్న నగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం ఇవ్వడంతో రాత్రి గ్రామానికి చేరుకొని చెట్ల మధ్య లోకి వెళ్లిన కొండచిలువను బయటికి లాగి పట్టుకున్నారు. అనంతరం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలివేశారు