ఒంగోలు అర్బన్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో యోగాసనాలు వేసిన పోలీసులు, యోగ పై వివరించిన శిక్షణకులు
Ongole Urban, Prakasam | Jun 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ఎస్సైలు, సిఐలు డిఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని యోగా గురువులు పోలీసులకు బోధించారు. శారీరిక దృఢత్వం మానసిక వికాసానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని శిక్షణకులు తెలిపారు.