ఒంగోలు అర్బన్: ఒంగోలు, అద్దంకి లోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి పెట్రోల్ బంకుల నిర్వహకులను హెచ్చరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 28, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఉదయం అద్దంకి ఒంగోలు ప్రాంతాలలోని వీఎస్ఆర్ పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకులోని నిల్వల గురించి నిర్వాహకులు, సిబ్బందితో మాట్లాడారు. డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంధనం కొరత లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎస్పీ తెలిపారు.