పటాన్చెరు: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా స్వచ్ భారత్ ర్యాలీ
బొల్లారం మున్సిపాలిటీలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ కిషన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపాలిటీలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా స్వచ్ భారత్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.