సంతనూతలపాడు: మన్నం వారి పాలెం లో ఖాళీ మద్యం బాటిల్స్ ను దగ్ధం చేసిన ఎస్సై అజయ్ బాబు
సంతనూతలపాడు మండలంలోని మన్నం వారి పాలెం లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఖాళీ మద్యం బాటిల్స్ ను పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై అజయ్ బాబు ఏరి వేశారు.. ఏరివేసిన మద్యం బాటిల్స్ ను గ్రామానికి సమీపంలోని ఖాళీ స్థలంలో శనివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై అజయ్ బాబు మాట్లాడుతూ... బహిరంగ ప్రదేశాల్లో, మరియు ఆలయాలు, పాఠశాలలకు సమీపంలో ఎవరైనా బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.