సైదాపూర్: మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ లో పట్టుబడ్డ సరైన ధ్రువపత్రాలు లేని 71 వాహనాలు, ఈ చలన ద్వారా జరిమానా
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి లో కార్డన్ సెర్చ్ లో పట్టుపడ్డ వాహనాలకు ఈ చలానా ద్వారా జరిమానా కట్టించుకున్నట్లు ఏసిపి మాధవి మంగళవారం తెలిపారు. దుద్దనపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన గార్డన్ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని 71 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు మొత్తంగా కలిపి 30,900 రూపాయలను ఈ చలానా ద్వారా కట్టించామని తెలిపారు. వాహనదారులు అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపాలని సూచించారు.