ప్రసన్నాయిపల్లి పంచాయతీలో సచివాలయ సిబ్బంది స్టోర్ డీలర్ భాషా ఆధ్వర్యంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ ను పంపిణీ చేశారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి పంచాయతీలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం ఐదున్నర గంటల వరకు ప్రసన్నాయిపల్లి చిన్మయ నగర్ పలు కాలనీలో స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయ సిబ్బంది టీడీపీ నేతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ డీలర్ భాష మాట్లాడుతూ ప్రసన్నాయిపల్లి పంచాయతీలో చిన్మయ నగర్ పలు కాలనీలో ప్రజలకు మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటి వద్దనే సచివాలయ సిబ్బందితో కలిసి అందజేస్తున్నామని ఈ స్మార్ట్ కార్డు వల్ల ప్రజలకు మరింత పారదర్శకంగా రేషన్ సరుకులు పంపిణీ చేయవచ్చునని స్టోర్ డీలర్ భాష పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.