గుత్తి మండలంలోని లచ్చానుపల్లిలో తమ భూముల్లో రైల్వే శాఖ అధికారులు వచ్చి రాళ్లు నాటారని పరిహారం ఇప్పించాలని రైతులు తహసీల్దార్ పుణ్యవతికి విన్నవించారు. బుధవారం గుత్తి మండలం లచ్చానుపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లచ్చానుపల్లి శివారులో అదనపు రైల్వే లైన్ కోసం అధికారులు పంట పొలాల్లోనీ భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేశారన్నారు. తమ భూముల్లో రైల్వే హద్దు ఏర్పాటు చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని రైతులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.