ఆందోల్: జోగిపేటలో సాక్షి పత్రిక మీడియాపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టుల నిరసన ర్యాలీ
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో జర్నలిస్ట్ లు ర్యాలీ నిర్వహించారు.సాక్షి పత్రిక మీడియాపై కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నల్ల బ్యార్జిలు ధరించి నిరసన తెలియజేశారు.సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై అక్రమ కేసు పెట్టడం దారుణమని స్థానిక హనుమాన్ చౌరస్తా నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి సాక్షి పత్రిక జర్నలిస్ట్ లకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు.కూటమి ప్రభుత్వ పోలీసులు కేసులు నోటీసుల పేరుతో జర్నలిస్ట్ ల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని జర్నలిస్ట్ లు ముక్త కంఠంతో నినాదాలు తెలియజేశారు.